ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం హను మాన్. అమృత్ అయ్యర్ కథానాయిక. కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ 36 మిలియ్ ప్లస్ వ్యూస్ క్రాస్ చేసి, పాన్ ఇండియా ప్రశంసలు అందుకుంటూ యూట్యూబ్‌లో టాప్ ట్రైండిరగ్‌లో ఉంది. తాజాగా ఈ చిత్రం యూనిట్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఆస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్‌జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.
