కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని మర్యదపూర్వకంగా కలిశారు. మెగాస్టార్ ఇంటికి వెళ్లిన కిషన్‌రెడ్డి, చిరుకు పుష్ఫం గుచ్ఛం ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాలు కప్పుకుని ఒకరిని ఒకరు సత్కరించుకున్నారు. సినీ పరిశ్రమకు చేసిన కృషి ద్వారా చాలామందికి స్పూర్తిని ఇచ్చారని, అలాంటి వారిని కలవడం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంద ని కిషన్ రెడ్డి తెలిపారు.
