ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్షిక సమావేశాలు, జీ`20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ అధికారిక పర్యటన సందర్భంగా ఆమె అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్తో భేటీ అవుతారని తెలుస్తోంది. తన అధికారిక పర్యటన అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నట్టు ట్వీట్ చేశారు. తన అమెరికా పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్ పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే విధంగా భారత్ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని వారిని ఆహ్వానించనున్నారు.