Namaste NRI

దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ కాకుండా.. ప్రత్యామ్నాయ పార్టీ అవసరం

ఉత్తర భారత్‌కు చెందిన ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలని ఆశిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల పేర్కొనారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై 51వ శాఖను ప్రారంభించారు. ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాకు మద్దతు కూడగట్టేందుకు మహేశ్‌ బిగాల యూరప్‌ దేశాల్లో ఉన్న ఎన్నారైలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి హంగేరీలో ఉన్న ఎన్నారైలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ఉత్తర భారతదేశ ఎన్నారైలు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కాకుండా ప్రత్యాన్మాయ పార్టీ అవసరమున్నట్లు ఎన్నారైలు భావిస్తున్నారని తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో తెలంగాణ విద్యార్థులకు సహాయం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎన్నారైలు ధర్యవాదాలు తెలిపారు. యుద్ధ సమయంలో వాలంటీర్లుగా పనిచేసిన ఎన్నారైలను అభినందించారు.

                ఈ కార్యక్రమంలో  ఏపీ, ఢల్లీి, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, జమ్ము`కశ్మీర్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు గిరి అభిలాష్‌, కల్యాణ్‌ వర్మ, భవానీ ప్రసాద్‌, సాగర్‌ పొట్లూరి అర్వింద్‌ కుమార్‌, సాహుల్‌, ఎలాజ, జోసెఫ్‌, కోమల్‌ ఇంగ్లీ, అభినవ్‌ దేశ్‌ పాండే, చందాన్‌ చక్రవర్తి, సిసిలీ ఎం కురియన్‌, విశాల్‌ జగపత్‌, సాయి వర్మ, ప్రదీప్‌ పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events