రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అన్ స్టాపబుల్. అన్ లిమిటెడ్ ఫన్ అనేది ఉపశీర్షిక. బిగ్‌బాస్ ఫేమ్ విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్నారు. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2బీ ఇండియా ప్రొడక్షన్స్‌లో రజిత్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ స్టాపబుల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అన్ స్టాపబుల్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం విడుదల తేదీని మంత్రి మల్లారెడ్డి అనౌన్స్ చేశారు. జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. సప్తగిరి, విజే సన్నీ తో పాటు సినిమా తారాగణం అంతా వున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్ టైనర్ అని భరోసా ఇస్తోంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం : డైమండ్ రత్నబాబు, నిర్మాత : రజిత్ రావు, బ్యానర్ : ఎ2 బి ఇండియా ప్రొడక్షన్, ప్రోడ్యుసర్లు: షేక్ రఫీ, బిట్టు, రాము వురు గొండ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, డీవోపీ: వేణు మురళీధర్, ఎడిటర్ : ఉద్ధవ్, లిరిక్స్ : కాసర్ల శ్యామ్, స్టంట్స్ : నందు, కోరియోగ్రఫీ: భాను, పీఆర్వో : వంశీ- శేఖర్.