Namaste NRI

తాము విజయం సాధించే వరకు.. ప్రజాస్వామ్య దేశాల మద్దతు

తాము విజయం సాధించే వరకు ప్రజాస్వామ్య దేశాలన్ని మద్దతు ఇస్తాయని, ఉక్రెయిన్‌ ఎన్నటికీ విఫలం కాదని  ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. క్రెమెన్‌చుక్‌ పట్టణంలో షాపింగ్‌ సెంటర్‌పై మిస్సైల్‌ అటాక్‌ జరిగిన నేపథ్యంలో జెలెన్‌స్కీ స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా రష్యా మారిందని ఆరోపించారు. రష్యా ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు. క్రెమిన్‌చుక్‌పై దాడితో పుతిన్‌ నేతృత్వంలోని రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద దేశంగా మారినట్లు ఆయన ఆరోపించారు.  రష్యా మరిన్ని దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలన్ని తమకు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. శిథిలాల కింద ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. షాపింగ్‌ సెంటర్‌పై దాడిలో మృతుల సంఖ్య 18కి చేరింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events