Namaste NRI

అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం…కమలా హ్యారీస్‌కు

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్‌ ను రద్దు చేసింది. ఈ విషయాన్ని శ్వేత సౌధం కార్యాలయం వెల్లడించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం మాజీ వైస్ ప్రెసిడెంట్‌కు పదవి ముగిసిన తర్వాత ఆరు నెలల పాటు ప్రత్యేక భద్రత కల్పిస్తారు.

ఈ నిబంధన ప్రకారమే హ్యారిస్‌కు సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్‌ కేటాయించారు. అయితే,  జూన్ 21న ఈ గడువు ముగిసింది. దాంతో, అప్పటి ప్రెసిడెంట్ జో బైడెన్  భద్రతను మరికొన్ని రోజులు పొడిగించారు. కానీ, హ్యారిస్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రతను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది.

Social Share Spread Message

Latest News