అమెరికాలో కరోనా నివారణకు శీతాకాల ప్రణాళికలో భాగంగా టీకాల బూస్టర్ డోసులు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు. దీనిపై అత్యవసరంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మాస్కులు ధరించడం తదితరాలు తప్ప కొత్త ఆంక్షలు ఏమీ లేకుండానే ఒమిక్రాన్ వంటి నూతన ఉత్పరివర్తనాలను ఎదుర్కోవాలని ప్రతిపాదించారు. ఇంటి దద్గర కరోనా పరీక్షలు చేయించుకుంటే ఖర్చులు చెల్లించాలని ప్రయివేటు ఆరోగ్య బీమా సంస్థలను ఆదేశించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పకుండా పరీక్షలు చేయించాలన్న నిబంధన కూడా విధించనున్నారు. దేశంలో మొత్తం పది కోట్ల మంది బూస్టర్ డోసులకు అర్హత సాధించారు. ఎంతగా నచ్చజెప్పినప్పటికీ మరో 40.3 లక్షల మంది అసలు టీకాలే వేసుకోలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బూస్టర్ డోసులపై అవగాహన కల్పించనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)