ఆపిల్, గూగుల్ సంస్థలకు అమెరికా చట్టసభ్యులు కీలక విజ్ఞప్తి చేశారు. టిక్‌టాక్‌ను ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తితో సహా ఇద్దరు యూఎస్ చట్టసభ సభ్యులు కోరారు. ఏప్రిల్‌లో ప్రెసిడెంట్ జో బైడెన్ సంతకం చేసిన బిల్లు సహా, బైటెడెన్స్ నిషేధాన్ని ఎదుర్కొంటుంది. యూఎస్ చట్టసభ సభ్యులు జాన్ మూలేనార్, రాజా కృష్ణమూర్తి ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లకు లేఖ రాశారు. జనవరి 19లోగా ఆయా యాప్ స్టోర్స్ నుంచి టిక్‌టాక్‌ని తొలగించేందుకు సిద్ధం కావాలని కోరారు. టిక్‌టాక్ సీఈవో షు జీ చౌని వెంటనే పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదించాలని లేఖలో కోరారు.

ఫారిన్ అడ్వైజరీ కంట్రోల్డ్ అప్లికేషన్ యాక్ట్ నుంచి అమెరిక్లను రక్షించే చర్యను డీసీ సర్క్యూట్ కోర్ట్ సమర్థించింది. ఈ క్రమంలో టిక్‌టాక్‌తో పాటు టీమ్ కుక్, సుందర్ పిచాయ్‌లకు చట్టసభ్యులు లేఖలో పంపారు. టిక్‌టాక్‌పై ఇప్పటికే చాలాదేశాలు నిషేధించాయి. టిక్‌టాక్‌ను భారత్ జూన్ 2020లో బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. భద్రతను దృష్టిలో పెట్టుకొని చైనాకు చెందిన 58 యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
