Namaste NRI

త్వరలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీవ్‌ పర్యటన!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  త్వరలోనే కీవ్‌ను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా హౌస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ చైర్మన్‌ ఆడమ్‌ స్కిఫ్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా కాంగ్రెస్‌ బృందం కీవ్‌లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆడమ్‌ స్కిప్‌ మాట్లాడుతూ జో బైడెన్‌ పర్యటన పరిశీలనలో ఉందని తెలిపారు. ఎంత తొందరగా ఈ పర్యటన సాధ్యమవుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడిరచారు. ఉక్రెయిన్‌లో పోరాటానికి అవసరమైన సాయంపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే దశను దాటిందని పేర్కొన్నారు. ఇప్పుడు అత్యంత సమీపం నుంచి ప్రత్యర్థితో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడిరచారు. సుదూరం నుంచి పోరాటం జరపాలంటే లాంగ్‌ రేంజి శతఘ్నులను వినియోగించాలని అన్నారు. ఈ భేటీ అనంతరం అమెరికా కాంగ్రెస్‌ బృందంలోని సభ్యులు అధ్యక్షుడు జో బైడెన్‌కు అవసరమైన సమాచారాన్ని అందజేశారు. కాకపోతే పర్యటన విషయం మాత్రం చర్చించలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events