ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న రష్యాపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్న ముడి చమురుపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ రష్యా నుంచి చమురు, గ్యాస్, ఎనర్జీ దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం అన్నారు. రష్యా నుంచి దిగుమతులు ఆగిపోతే ఆ దేశానికి నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. తమతో పోలిస్తే ఐరోపా దేశాలు రష్యా చమురు ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడ్డాయని అన్నారు. తాజా ఆంక్షల విషయంలో ఆయా దేశాలు తమతో కలిసి రాకపోయినా అర్థం చేసుకొంటామన్నారు.














