సముద్రంపై నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్లపై ఆంక్షల్ని ఎత్తేయాలని అమెరికా భావిస్తున్నది. యుద్ధం కారణంగా ఇరాన్ ముడి చమురు ట్యాంకర్లు పెద్ద సంఖ్యలో హొర్ముజ్ జలసంధిని దాటివెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. వీటిపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయటం ద్వారా ప్రపంచంలో ముడి చమురు సరఫరా పెరుగుతుందని, ఆకాశన్నంటుతున్న ధరలు తగ్గుతాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ తెలిపారు.

అమెరికా ఆంక్షల్ని త్వరలో ఎత్తివేయవచ్చునని ఆయన చెప్పారు. సముద్రంపై ఇరాన్ ముడి చమురు సుమారుగా 140 మిలియన్ బ్యారెళ్లు ఉంటుంది. దీనిని ప్రపంచ మార్కెట్లకు చేర్చటం వల్ల రాబోయే 10-14 రోజులపాటు ధరలను అదుపులో ఉంచగలం అని బెస్సెంట్ అన్నారు. అమెరికా సాగిస్తున్న యుద్ధంతో హొర్ముజ్ జలసంధిలో ముడి చమురు సరఫరా దాదాపు నిలిచిపోయింది. ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండటం, అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నది.















