ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైనికంగా, ఆర్థికంగా ఆదుకోవాలని చైనాను రష్యా వేడుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా వార్నింగ్ జారీ చేసింది. ఒకవేళ రష్యాకు చైనా సహకరిస్తే అప్పుడు ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన తర్వాత చైనా సైనిక సహాయాన్ని రష్యా కోరినట్లు తెలిసింది. అయితే ఇలాంటి అభ్యర్థన గురించి తమకు సమాచారం లేదని వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ తెలిపింది. వాస్తవానికి ఉక్రెయిన్‌పై దాడి మొదలైన తర్వాత రష్యాకు చైనా మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ డ్రాగన్ దేశం సైనిక, ఆర్థిక సాయాన్ని అందించినట్లు మాత్రం సమాచారం లేదు. తమకు డ్రోన్లు కావాలంటూ చైనాను రష్యా కోరినట్లు తెలుస్తోంది.