
పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా షూటింగ్‌ను కూడా జూన్ లో మొదలుపెట్టనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హరీష్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఇందులో పవన్‌కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో అశుతోష్ రానా, నవాబ్‌షా, గౌతమి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్‌సాయి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్.
