వరుణ్ సందేశ్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం యద్భావం తద్భవతి. ఇనయ సుల్తానా కథానాయిక. వరుణ్ సందేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో సందీప్‌కిషన్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ కొత్తగా కనిపిస్తున్నారు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న మాస్ చిత్రమిది. వరుణ్ సందేశ్ కెరీర్‌కు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది అన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ వస్తే హ్యాపీడేస్ విడదలై పదిహేనేళ్లవుతోంది. నా ప్రయాణంలో అండగా నిలిచిన వారికీ కృతజ్ఞతలు. యద్భావం తద్భవతిలో ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరుస్తాం. లుక్ విడుదల చేసిన సందీప్‌కిషన్‌కి కృతజ్ఞతలు అన్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి రమేష్ జక్కల దర్శకుడు. ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాత. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శరత్ శ్రీకంఠం, సంగీతం: మిహిరమ్స్, కెమెరా:కల్యాణ్ శ్యామ్.














