వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ నటిస్తున్న 12వ చిత్రమిది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు క్లాప్ నివ్వగా వరుణ్ తేజ్ తల్లి పద్మజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇద్దరూ సంయుక్తంగా చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. ఈ సినిమాకి ఇంకా పేరు ఖరారు చేయలేదు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు, బీవీఎస్ఎస్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్ల, సినిమాటోగ్రఫీ: ముఖేష్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)