వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం మట్కా. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ కథానాయికలు. కరుణకుమార్ దర్శకత్వం. డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో శరవేగంగా జరుగుతున్నది. కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకునే ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.
ఈ సినిమాలో వరుణ్ డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించనున్నారని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాఫీగా జరుగుతున్నాయనీ, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, సలోని, అజయ్‌ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్రవిజయ్, పి.రవిశంకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కిశోర్‌కుమార్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: వైరా ఎంటైర్టెన్మెంట్స్, ఎస్.ఆర్.టి. ఎంటైర్టెన్మెంట్స్.