తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ప్రీ వెడ్డింగ్ షో. సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ చుట్టూ ఓ ప్రేమ కథ, ఓ వింత సమస్య, దాన్నుంచి జెనరేట్ అయ్యే కామెడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా నుంచి వయ్యారి వయ్యారి అంటూ సాగే ఓ క్యాచీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.సనారే సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉంది. ఇక యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. సురేష్ బొబ్బిలి బాణీ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేకర్లు, మాస్టర్ రోహన్ నటిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి రచయిత- దర్శకుడు: రాహుల్ శ్రీనివాస్, సంగీతం : సురేష్ బొబ్బిలి, డీఓపీ : సోమ శేఖర్, ఎడిటర్ : నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రజ్ఞయ్ కొణిగారి, ప్రొడక్షన్ డిజైనర్ : ఫణి తేజ మూసి.















