నరేష్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హాస్యభరిత చిత్రం వీరాంజనేయులు విహారయాత్ర. అనురాగ్ పలుట్ల దర్శకుడు. బాపినీడు, బి.సుధీర్ ఈదర నిర్మాతలు. ఆగస్ట్ 14న ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రియాతిప్రియమైన కుటుంబ సభ్యులకు మీ వీరాంజనేయులు ప్రేమతో రాయునది. ఆఖరి కోరికగా కుటుంబం అంతా గోవాలో నా అస్థికలు కలుపుతారని నమ్ముతున్నాను అంటూ బ్రహ్మానందం వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం నవ్వుల్ని పంచింది. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలబోతగా ఆకట్టుకుంది. నరేష్ తన సహజమైన నటనతో మెప్పించారు. ఈ చిత్రానికి కెమెరా: అంకుర్ సీ, సంగీతం: ఆర్.హెచ్.విక్రమ్, రచన-దర్శకత్వం: అనురాగ్ పాలుట్ల.