హీరో వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా సైంధవ్. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా నేటి నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. వెంకటేష్ సహా కీలక పాత్రధారులు సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రం నుంచి వెంకటేష్ లుక్‌ను విడుదల చేస్తూ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు చిత్రబృందం. సైంధవ్ కథ చంద్రప్రస్థ అనే కల్పిత ఓడరేవు ప్రాంతంలో సెట్ చేయబడిందని సూపర్ కూల్ గ్లింప్స్ వీడియో వెల్లడిస్తుంది. వెంకీ గడ్డంతో కఠినమైన అవతార్‌లో కనిపిస్తాడు మరియు అతను చేతిలో తుపాకీని కూడా పట్టుకున్నాడు. వీడియో చివర్లో టోన్, డ్రగ్ సీసా, పేలుడు మరియు వెంకీ యొక్క శక్తివంతమైన డైలాగ్‌లు సైంధవ్ యాక్షన్‌లో ఎక్కువగా ఉండబోతున్నాయని, వెంకీ తీవ్రమైన పాత్రను పోషిస్తున్నాడని సూచిస్తున్నాయి. సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. హిందీ సహా దక్షిణాది భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుందీ సినిమా.
