విక్రమ్, అమృత చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం విక్కీ ది రాక్‌స్టార్. సీఎస్ గంటా దర్శకత్వంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ షేడ్‌ను ఇటీవల విడుదల చేశారు. జీవితంలో ఫస్ట్‌లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం. అవి మరిస్తే ఒక వరం. మరకపోతే మరణం అంటూ వినిపించిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ పూర్తి వైవిధ్య భరితమైన కథాంశంతో రూపొందుతున్న యూత్‌ఫుల్ చిత్రమిది. తొలిప్రేమ జ్ఞాపకాల నేపథ్యంలో ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. తప్పకుండా చిత్రం యూత్‌తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సుభాష్, చరిత. సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం: భాస్కర్.














