Namaste NRI

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విజయ్ రష్మిక (విరోష్) జంట

వెండి తెరపై మంచి జంట అనిపించుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న(విరోష్) వివాహ బంధంతో ఒక్కటయ్యారు.నా ప్రాణ స్నేహితురాలు నా భార్య అయ్యింది అని పెళ్లి తరువాత విజయ్ దేవరకొండ ఆనందం వ్యక్తంచేయగా. ‘నా భర్త విజయ్’ అంటూ రష్మిక ప్రపంచానికి పరిచయం చేసింది. స్వశక్తి తో ఎదిగిన ఇద్దరు నటులు తమ టాలెంట్ తో ఎదిగి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు, రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఫిబ్రవరి 26 గురువారం విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న(విరోష్)మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు .విరోష్ పేరుతో జరిగిన ఈ వివాహ వేడుకలకు ఇద్దరికీ సన్నిహితులైన పలువురు కుటుంబ సభ్యులు సినిమా ప్రముఖులు హాజరయ్యారు. గురువారం ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం 10 గం. 10 ని. జీలకర్ర బెల్లం తంతుతో కొత్త జంట ఒక్కటయ్యింది .అదేరోజు సాయంత్రం వదువు ఇంటి కొడవ సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక నిర్వహించారు. అనంతరం కొత్త జంట పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా పలువురు ప్రముఖులు అభిమానులు అభినందనలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events