Namaste NRI

ఘనంగా విజయ్ ఆంటోనీ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్

విజయ్‌ ఆంటోని  కథానాయకుడిగా రూపొందిన పొయెటిక్‌ యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ తుఫాన్‌. మేఘా ఆకాష్‌ కథానాయిక. విజయ్‌ మిల్టన్‌ దర్శకుడు. కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా నిర్మాతలు. హైదరా బాద్‌లో ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విజయ్‌ ఆంటోనీ మాట్లా డారు. ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూడాలని ఉంది. తుఫాన్‌ లాంటి గొప్ప సినిమా నాకిచ్చిన దర్శకు డు విజయ్‌ మిల్టన్‌కు థ్యాంక్స్‌. తను అద్భుతమైన దర్శకుడేకాదు, గొప్ప సినిమాటోగ్రాఫర్‌ కూడా. తుఫాన్‌ విజువల్స్‌ చూస్తే అది అర్థమవుతుంది. ఈ సినిమా నేపథ్యం కొత్తగా ఉంటుంది. అందరూ తుఫాన్‌ ని ఎంజాయ్‌ చేస్తారు అని విజయ్‌ ఆంటోని నమ్మకం వ్యక్తం చేశారు.

 ఓ మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, మా హీరో విజయ్‌ ఆంటోనీకి థ్యాంక్స్‌ చెప్పుకుంటు న్నాను. తుఫాన్‌ అందరికీ నచ్చుతుంది అని దర్శకుడు చెప్పారు. తన కెరీర్‌లో తుఫాన్‌ ప్రత్యేకమైన సినిమా అని కథానాయిక మేఘా ఆకాష్‌ అన్నారు. ఇంకా నిర్మాతలతోపాటు చిత్ర యూనిట్‌ కూడా మాట్లాడారు. భాష్యశ్రీ సంభాషణలు అందించిన ఈ చిత్రానికి అచ్చు రాజమణితో కలిసి విజయ్‌ ఆంటోని స్వరాలందించారు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News