విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్లో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ కథానాయిక. దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కథానుగుణంగా ఈ టైటిల్ బాగుంటుందనేది చిత్రబృందం ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్నందిస్తున్నారు.


