తమిళనాట తిరుగులేని కథానాయకుడిగా చలామణి అవుతున్నారు విజయ్. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాదమై ఘన విజయం సాధించాయి కూడా. ఇప్పటివరకూ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తాజాగా ఓ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్‌లో నటించనున్నారు. విజయ్ కెరీర్‌లో 66వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ నిర్మించనున్నారు. ఈ సినిమాని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ నెలకొంది. నెల్సన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తోన్న 65వ చిత్రం బీస్ట్ పూర్తయ్యాక మా చిత్రం ప్రారంభమవుతుంది. ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు మా ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు అని నిర్మాతలు పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)