Namaste NRI

విజయ్‌- పూరీల.. జనగణమన ప్రారంభం

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ, అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం జనగణమన ముంబయిలో మొదలైంది. జేజీఎం (జనగణమన) పేరుతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. సినిమా ప్రారంభం కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ ఆర్మీ గెటప్‌తో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.  పూర్తి జగన్నాథ్‌ మాట్లాడుతూ విజయ్‌తో మళ్లీ సినిమా చేయడం సంతోషంగా ఉంది. బలమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఏప్రిల్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం అన్నారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ జేజీఎమ్‌ కథ అద్భుతంగా, ఛాలెంజింగ్‌గా ఉంది. ప్రతి భారతీయుణ్ణి ఈ కథ టచ్‌ చేస్తుంది. ఇందులో సరికొత్త పాత్ర చేస్తున్నాను అన్నారు.  ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్‌, పూరి జగన్నాథ్‌, చార్మీలతో కలిసి పని చేయడం హ్యాపీగా ఉంది అన్నారు వంశీ పైడిపల్లి. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌, శ్రీకర స్టూడియో ప్రొడక్షన్‌పై చార్మీ కౌర్‌, వంశీ పైడిపల్లి పూరి జగన్నాథ్‌ నిర్మాస్తున్నారు.  2023 ఆగస్టు 3న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.  శ్రీకర స్టూడియోస్‌, డైరెక్టర్‌ సింగారావు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events