వ్యాపారవేత్త విజయ్ మాల్య కోర్టు ధిక్కరణ వ్యవహారంపై ఇక వేచి చూసేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 18న ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ యూయూ లలిత్, జిస్టిస్ ఎస్.ఆర్.భట్, జస్టిస్ బేలా ఎం. త్రివేదీలతో కూడిన ధర్మాసననం చెప్పింది. దాదాపు రూ.9 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితడైన విజయ్ మాల్యా గతంలో బ్రిటన్‌కు పరారైన సంగతి తెలిసిందే. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో అతని న్యాయస్థానం దోషిగా తేల్చగా ఈ వ్యవహారంలో శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. ఈ తీర్పుపై సమీక్షను కోరుతూ మాల్యా దాఖలు చేసిన విజ్ఞాపనను కూడా గత ఏడాది సుప్రీంకోర్టు కొట్టివేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)