కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం మేకింగ్ గ్లింప్స్ విడుదలయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరెక్కుతోన్న చిత్రమిది. విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, ఫాహద్ ఫాజిల్ పవర్‌పుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉండి, కొత్త తరహా సినిమా అనే అంచనాలను ఏర్పర్చాయి. సినిమా విడుదల సందర్భంగా కమల్ హాసన్ స్పందిస్తూ.. మా విక్రమ్ కోసం నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ మీ ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది అన్నారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మా చిత్రం విడుదల చేస్తున్నాం అని చిత్ర బృందం పేర్కొంది. కాళిదాసు జయరామ్, నరేన్, శివానీ, నారాయణన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్.














