Namaste NRI

వినరో భాగ్యము విష్ణు కథ ప్రారంభం

కిరణ్‌ అబ్బవరం, కశ్మీర్‌ పర్దేశి జంటగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మురళీకిషోర్‌ దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ మనవరాలు అల్లు అన్విత్‌( అల్లు బాబీ కుమార్తె) క్లాప్‌నివ్వగా, నిర్మాత బన్సీవాసు కెమెరా స్విఛాన్‌ చేశారు. అల్లు అరవింద్‌ పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మాత మాట్లాడుతూ వినోదభరిత ప్రేమకథా చిత్రమిది. ప్రశాంత్‌ నీల్‌, కిషోర్‌ తిరుమల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన మురళీకిషోర్‌ నవ్వమైన పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నవ్విస్తూనే చక్కటి అనుభూతిని పంచుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, సినిమాటోగ్రఫీ : విశ్వాస్‌ డేనియల్‌. ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events