మయన్మార్‌కు ప్రస్తుతం భారత్ రాయబారిగా వ్యవహరిస్తున్న వినయ్ కుమార్ రష్యాకు తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినయ్ కుమార్ త్వరలో నూతన బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రష్యా దీర్ఘకాలంగా భారత్‌కు భాగస్వామిగా ఉంది. భారత విదేశాంగ విధానంలో భారత్-రష్యా సంబంధాలు కీలక భూమిక పోషిస్తు న్నాయి. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వ్లాదిమర్ పుతిన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షులుగా తిరిగి ఎన్నికైన వ్లాదిమర్ పుతిన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విధంగా మీతో కలిసిపనిచేసేందుకు వేచిచూస్తున్నామని ప్రధాని రాసుకొచ్చారు.