Namaste NRI

షికార్ ట్రైలర్ ఆవిష్కరించిన వినాయక్

సాయి ధన్సిక, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి, ధీరజ్‌ ఆత్రేయ నవకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం షికారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్‌ హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దర్శకునిగా నా తొలి సినిమా ఆది. ఇందులో రెండు సీన్స్‌ చూసి ఎక్కువ రేటుకు కొన్నారు బాజ్జీ. ఆయనకు నా సినిమాపై నమ్మకం అలాంటిది. బడ్జిమెంట్‌ బాగా తెలుసు. వైజాగ్‌ పంపిణీదారుగా ఆయనకు మంచిపేరు ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.  కాలా చిత్రంలో రజనీకాంత్‌ కూతురుగా నటించాను. తర్వాత చాలా తెలుగు అవకాశాలు వచ్చాయి. ఈ చిత్రంలో మంచి పాత్ర దొరికింది అంది నాయిక ధన్సిక. దర్శకుడు మాట్లాడుతూ ఈ తరానికి సరిపోయే మంచి యూత్‌పుల్‌ చిత్రమిది. ఆద్యంతం వినోదం పంచుతుంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా అన్నారు. హరి ఈ కథను చాలా అందంగా వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. శేఖర్‌ చంద్ర చక్కటి స్వరాలు సమకూర్చారు అన్నారు నిర్మాత.  ఈ చిత్రానికి హరి కొలగాని దర్శకుడు. పి.ఎస్‌.ఆర్‌.కుమార్‌ నిర్మాత. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్‌,  గీత రచయిత భాస్కరభట్ల రవి, సునీల్‌ కుమార్‌ రెడ్డి, అమ్మిరాజు, నటుడు చమక్‌ చంద్ర, ప్రసన్నకుమార్‌  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events