Namaste NRI

వినాయకచవితి స్పెషల్..మన శంకరవరప్రసాద్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మన శంకరవరప్రసాద్‌ గారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ ఆధ్వర్యంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌తో సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. పండగకి వస్తున్నారు  అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి చిరంజీవి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన సంప్రదాయ పంచెకట్టులో మెరిసిపోతున్నారు.

ట్రెడిషనల్‌ టచ్‌తో పాటు చిరంజీవి తనదైన స్వాగ్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి తనదైన శైలి హాస్యం, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇందులో వింటేజ్‌ చిరంజీవిని చూడబోతున్నారని, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ పక్కా అని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: షైన్‌స్క్రీన్స్‌ అండ్‌ గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events