లగడపాటి విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం వర్జిన్ స్టోరి. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉప శీర్షిక. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన కంటెంట్ ఆసక్తిగా ఉంది. విక్రమ్ నటనలో ఈజ్ కనిపించింది. ఈ చిత్రంలో విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు నటిస్తున్నారు. సంగీతం అచు రాజమణి, ఛాయాగ్రహణం: అనీష్ తరుణ్ కుమార్. ఈ చిత్రాన్ని ఇదే నెల 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని లగడపాటి శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రుద్రమదేవి, రేసుగుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో చిత్రాల్లో విక్రమ్ నటించారు. అలాగే ఇటీవల విడుదలైన రౌడీ భాయ్స్‌లో ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ యువనటుడు వర్జిన్ స్టోరీతో హీరోగా ప్రేకుల ముందుకు వస్తున్నారు.














