కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మరోసారి ప్రమాదకర వైరస్‌లు వెలుగుచూశాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 71 రకాల వైరస్‌లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ వైరస్ జంతువుల నుంచే మనుషులకు సోకిందని పలు పరిశోధనలు వెల్లడిరచాయి. ఈ నేపథ్యంలోనే చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరీక్షలు చేశారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1725 వన్య ప్రాణులపై ఈ పరీక్షలు జరిపినట్లు వారు వెల్లడిరచారు. చైనా ప్రభుత్వం విక్రయానికి నిషేధించిన పలు జంతువులపైన కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. పిల్లల మాదిరిగా ఉండే సివెట్స్ అనే జంతువుల్లోనే అత్యధికంగా ప్రమాదకర వైరస్‌లను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. గబ్బిలాల నుంచి వచ్చే హెచ్‌కేయూ 8 రకం వైరస్ ఓ సివెట్‌కు వ్యాప్తించినట్లు గుర్తించామన్నారు. ఇంకా పలు జంతువుల్లో కూడా ఈ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు.














