Namaste NRI

భారతీయ విద్యార్థుల్లో పెరిగిన అనాసక్తి… వీసా నిబంధనలే కారణం

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మే మధ్య అమెరికా ఎఫ్‌-1 వీసాల జారీ 27 శాతం పడిపోయింది. ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో భారతీయ విద్యార్థులకు కేవలం 9,906 ఎఫ్‌-1 వీసాలు జారీ అయినట్లు అమెరికా విదేశాంగ శాఖ నుంచి లభ్యమైన డాటా తెలియచేస్తోంది. గత ఏడాది ఇది 13,478 ఉండగా, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత 2022లో సైతం 10,894 ఎఫ్‌-1 వీసాలు జారీ అయ్యాయి. ఎఫ్‌-1 వీసా జారీలు తగ్గిపోవడం విద్యార్థులు, విద్యా సంబంధ కన్సల్టెంట్లతోపాటు ఇరు దేశాలకు చెందిన విద్యా సంస్థలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా మార్చి నుంచి జూలై మధ్య కాలం అత్యంత కీలకమైన వీసా సీజన్‌. మొదటి సెమిస్టర్‌లో చేరే విద్యార్థులు ఈ సీజన్‌లోనే అమెరికా వెళతారు. ఈ సీజన్‌లో ఎఫ్‌-1 వీసాలు తగ్గిపోవడం అమెరికా విద్య పట్ల భారతీయ విద్యార్థుల అనాసక్తిని సూచిస్తున్నది.

ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాల సంఖ్య తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పాలనాపరమైన జాప్యం ఏర్పడడం, దరఖాస్తుల స్క్రూటినీ తీవ్రతరం కావడం, మే 27 నుంచి జూన్‌ 18 వరకు కొత్త ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేయడం, సోషల్‌ మీడియా ఖాతాలతోపాటు విద్యార్థుల నేపథ్యాన్ని లోతుగా పరిశీలించడం వల్ల ఎఫ్‌-1 వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్‌ నిలిచిపోవడం వంటివి అనేక కారణాలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events