ఆసియాలో కీలకమైన రష్యా, ఇండియా, చైనా మధ్య త్వరలో త్రైపాక్షిక భేటీ జరిగే అవకాశాలున్నాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరి ఉషకోవ్ వెల్లడిరచారు. చైనా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఉందని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకున్నప్పుడు ఈ రష్యా, ఇండియా, చైనా కూటమి ప్రస్తావన వచ్చిందని యూరి ఉషకోవ్ చెప్పినట్లు తెలిసింది. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న యూరి ఉషకోవ్ ప్రస్తావించిన ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
అయితే కొన్ని రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. రష్యాతో ఆయుధాల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మోదీని ఢల్లీిలో పుతిన్ కలిశారు. జపాన్ లోని ఒసాకాలో 2019లో జి`20 సదస్సు సందర్భంగా ఈ మూడు దేశాలు భేటీ అయ్యాయి. షాంఘై సహకార సంస్థ తరహాలో ఆర్ ఐసీ కూడా పరస్పర సహకారం, గౌరవం, పారదర్శకత, మూడు దేశాల ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునేలా అవగాహనకు వచ్చేందుకు ప్రత్యేకమైన అంతర్జాతీయ వేదిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు దేశాల మధ్య పరస్పర సహకారమే లక్ష్యంగా భవిష్యత్ లో ఒక వేదికపై చర్చలు జరిపేందుకు అవకాశం ఉంది. ఢల్లీికి పుతిన్ వెళ్లిన అంశాన్ని చైనా అధ్యక్షుడికి తెలియజేసినట్లు కూడా ఆయన తెలిపారు.














