రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న వివేక్ రామస్వామి తన పిల్లల సంరక్షణ కోసం ఆయాను నియమించుకోవాలని అనుకొంటున్నారు. ఈ ఉద్యోగానికి ఆయన ఏకంగా లక్ష డాలర్ల (రూ.80 లక్షల)కు పైగా వేతనాన్ని ఇవ్వజూపుతున్నట్టు తెలుస్తున్నది. భారత సంతతికి చెందిన వివేక్, అపూర్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి సంరక్షణను చూసుకునే ఆయా వారానికి 84 నుంచి 96 గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది.
