అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి కీలక నిర్ణయం ప్రకటించారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్ ఎన్నికల్లో వివేక్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇదే సమయంలో మరోసారి అధ్యక్ష పీఠం కోసం ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొలి విజయం నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.














