రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో మూడేళ్లు మాత్రమే బతుకుతారని వైద్యులు చెప్పినట్లు ప్రచారం జరగుతుంది. క్యాన్సర్‌తో పుతిన్ ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్నట్లు వైద్యులు తేల్చారని రష్యా నిఘా అధికారి ఒకరు వెల్లడిరచారు. పుతిన్ క్రమంగా కంటి చూపు కూడా కోల్పోతున్నారని తెలిపారు. అయినప్పటికీ కళ్లద్దాలు ధరించేందుకు ససేమిరా అంటున్నారని వివరించారు. దృష్టి లోపం ఉన్నట్లు అంగీకరించడం పుతిన్‌కు ఇష్టం లేదని పేర్కొన్నారు. తన కింద పనిచేసే సిబ్బందిపై చీటికీమాటికీ కోపగించుకుంటున్నారని, సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని సదరు నిఘా అధికారి తెలిపారు. పుతిన్ రెండు నుంచి మూడేళ్లు మాత్రమే బతుకుతారని చెప్పారు. అయితే పుతిన్ ఆరోగ్యంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావోరోవ్ ఘాటుగా స్పందించారు. పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలు అంతా ఉత్త ప్రచారమే అని కొట్టాపారేశారు ఆయన. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపాడు.
