Namaste NRI

హైదరాబాద్‌లో వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  కేటీఆర్‌ అమెరికాలో పర్యట్తిన్నారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణానికి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా ఐటీ అనుబంధ సేవా రంగంలో హైదరాబాద్‌లో సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బెయిన్‌ క్యాపిటల్‌  గ్రూప్‌నకు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌  ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం సంస్థ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ ఎరికా బోగర్‌కింగ్‌ ఈ మేరకు వెల్లడించారు. దీనిద్వారా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో సేవలు అందిస్తున్నది. కాగా, నగరానికి మరో ఐటీ సంస్థ రావడంతో మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News