మహేష్ దత్త, సోనీ శ్రీవాస్తవ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం మాటరాని మౌనమిది. సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్ర పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని దం దం దంపుడు లక్ష్మీ అనే లిరికల్ పాటను విడుదల చేశారు. అషిర్ లూక్ స్వరపరచిన ఈ పాటకు డి సయ్యద్ భాషా సాహిత్యం అందించగా, రేవంత్, మనీషా పాండ్రంకి, యువరాహుల్ కనపర్తి పాడారు. దం దం దంపడు లక్ష్మీ పాటలో జాస్ప్రీత్ కౌర్ నటించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.
