Namaste NRI

వాంటెడ్‌ పండుగాడు పోస్టర్‌ విడుదల

శతాధిక చిత్ర దర్శకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్‌ కె ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సునీల్‌, అనసూయ భరధ్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, సుడిగాలి సుధీర్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం వాంటెడ్‌ పండుగాడ్‌. పట్టుకుంటే కోటి ట్యాగ్‌లైన్‌గా ఉంచారు. ఇందులో సుడిగాలి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా యూనిట్‌ బర్త్‌డే విషెస్‌ చెబుతూ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ఇందులో సుడిగాలి సుధీర్‌ కీలకపాత్రలో నటిస్తున్నారని అన్నారు. హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందన్నారు. జనార్థన మహర్షి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, అందిస్తున్నారని తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్‌ చేయనున్నామని తెలిపారు. శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో సాయిబాబు కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. మూడు, నాలుగు రోజులు మాత్రమే బ్యాలెన్‌స ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేస్తామన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events