సునీల్, అనసూయ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వాంటెడ్ పండుగాడ్. పట్టుకుంటే కోటి అన్నది ఉప శీర్షిక. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ వినోదాత్మక చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. జనార్థన మహర్షి చెప్పిన కథ బాగా నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాం. తనికెళ్ల భరణి దర్శకత్వం వహంచాల్సి ఉండేది. నా గత సినిమా పెళ్లి సందడికి మంచి డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపాన కథకు న్యాయం చేయగలడు అనిపించింది. ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. మంచి ఎంటర్‌టైనర్ ఇది. జూన్ చివరి వారంలో లేదా జులై తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం అన్నారు. ఆమని, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, సుడిగాలి సుధీర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ సీపాన దర్శకుడు. సాయిబాబా కోవెలమూడి, వెంకట్ కోవెల మూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాఘవేంద్రరావు సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనార్ధన మహర్షి, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, ఆమని తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగుల, ఎడిటర్: తమ్మిరాజు, సంగీతం: పీఆర్.
