వరంగల్ నగరానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి సంస్థ యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో వరంగల్ నగరానికి స్థానం లభించింది. క్రితం సంవత్సరం ఓరుగల్లు రామప్పగుడికి యూనెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడం విదితమే. ఏడాది వ్యవధిలో మరొక ఆసరి యునెస్కో గుర్తింపునకు నోచుకోవడం విశేషం. దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణలోని వరంగల్ నగరం కూడా యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఆనందమయ క్షణాల నేపథ్యంలో వరంగల్‌కు, తెలంగాణకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)