Namaste NRI

యాపిల్‌ యూజర్లకు హెచ్చరిక

ఐఫోన్లు, ఐప్యాడ్స్‌ ఇతర యాపిల్‌ ఉత్పత్తులు వాడుతున్న యూజర్లు హై రిస్క్‌లో ఉన్నారని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఐఫోన్‌ సహా యాపిల్‌ ఉత్పత్తుల్ని సైబర్‌ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని, ఈ నేపథ్యం లో యాపిల్‌ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చునని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌) తాజాగా ఓ అడ్వైజరీ జారీచేసింది. యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సైబర్‌ మోసగాళ్లు దొంగలించే ప్రమాదముందని హెచ్చరించింది.ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ బుక్స్‌, విజన్‌ ప్రో హెడ్‌ సెట్స్‌లలో ఏ ఏ వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌కు ముప్పు పొంచి వుందన్నది తెలుపుతూ జాబితాను విడుదల చేసింది.

ఐప్యాడ్‌, ఐప్యాడ్‌ల్లోని 17.6 సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు, 16.7.9, 14.6 మ్యాక్‌ఓఎస్‌ సోనోమా సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు, 13.6.8 మ్యాక్‌ఓఎస్‌ వెంచురా వెర్షన్లు, 12,7,6 మ్యాక్‌ఓఎస్‌ మాంటెరరీ సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు, వాచ్‌ఓఎస్‌ (10.6), 17.6, విజన్‌ఓస్‌ (1.3) సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు హై-రిస్క్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ను యూజర్లు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

Social Share Spread Message

Latest News