ఈ ఏడాది జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. కొద్ది రోజుల కిందటే ఈ హామీ ఇచ్చినప్పటికీ తాజాగా మళ్లీ ఈ విషయం చర్చకు వచ్చింది. అమెరికా భద్రతా సలహాదారు, చైనా విదేశాంగ మంత్రి మధ్య జరిగిన చర్చల సందర్భంగా జిన్‌పింగ్ హామీ తెరపైకి వచ్చింది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి తెలిపారు.
