విజయ్‌శంకర్, అప్సరా రాణి జంటగా నటిస్తున్న రాచరికం. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్‌నివ్వగా, నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విఛాన్ చేశారు. విజయరామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాషా, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్ తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వైవిధ్యభరితమైన కథ ఇది. ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది అన్నారు. ఆరు నెలలుగా స్క్రిప్ట్‌పై వర్క్ చేశామని, తప్పకుండా అందరిని అలరిస్తుందని చిత్ర నిర్మాత ఈశ్వర్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్యసాయి కృష్ణ, సంగీతం: వెంగీ, నిర్మాణ సంస్థ: చిల్‌బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ లంకలపల్లి.