
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో లెలిజాల రవీందర్ హీరోగా నటిస్తున్న చిత్రం రాజుగాని సవాల్.ఈ చిత్ర టీజర్‌ను అగ్ర నటుడు జగపతిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత లెలిజాల రవీందర్ మాట్లాడుతూ హైదరాబాద్ నేపథ్యంలో జరిగే కథ ఇదని, తెలంగాణలోని కుటుంబ బంధాలు, స్నేహం తాలూకు గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుందని, వినోదంతో పాటు హృదయాన్ని కట్టిపడేసే భావోద్వేగాలుంటాయని తెలిపారు. ఈ సినిమాలో హైదరాబాద్ లోకల్ కల్చర్‌ను అద్భుతంగా చూపించారని కథానాయిక రితికా చక్రవర్తి తెలిపింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మనసుకు హత్తుకునే సెంటిమెంట్ ఉంటుందని నిర్మాత తరుణిక పేర్కొన్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
















