శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం మనమే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ క్లాసీగా కనిపిస్తున్నారు. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది.
కథలో చర్చించిన పాయింట్ అందరికి కనెక్ట్ అవుతుంది. వినోదం, భావోద్వేగాల కలబోతగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. కథానుగుణంగానే టైటిల్ పెట్టాం అని చిత్రబృందం పేర్కొంది. జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.