Namaste NRI

మాకు ఆశ లేదు.. వచ్చే ఆరు నెలలు మాత్రమే

నేపాల్‌ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన సుశీల కర్కి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని కార్యాలయానికి వెళ్లిన సుశీల మీడియాతో మాట్లాడారు. తన తొలి ప్రసంగంలోనే ఆమె తమ ప్రభుత్వ ఉద్దేశాలను దేశ ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. తనకు, తన మంత్రివర్గానికి అధికారం, పదవలపై ఆశలేదని, వచ్చే ఆరు నెలలు మాత్రమే తాము కొనసాగుతామని ఆమె వెల్లడించారు.

నాకు, నా టీమ్‌కు పదవులపై ఆశలేదు. అధికారం అనుభవించాలనే ఉద్దేశం అంతకన్నా లేదు. మేము ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పదవిలో ఉండము. ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన పార్లమెంట్‌కు అధికారాన్ని బదలాయిస్తాం. మరో విషయం మీ మద్దతు లేకుండా మేము ఎక్కువ రోజులు కొనసాగలేము. కేవలం 27 గంటల్లోనే నిరసనల కారణంగా దేశంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అల్లర్ల పేరుతో నిరసనకారులు పలు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా నిప్పు పెట్టారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం.. ఒక కుట్రలో భాగంగా జరిగింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది్ణ అని ప్రధాని సుశీల తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events